రెండోసారి కూడా మోసపోయిన నయన తార..!

‘గజిని’ చిత్రం విషయంలో దర్శకుడు మురుగదాస్ నన్ను మోసం చేసాడు. నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పి.. నమ్మించాడు. కనీసం సెకండ్ హీరోయిన్ లా కూడా ఉండదు ఆ పాత్ర… ఇవి నయన్ చేసిన కామెంట్స్. పోనీ వీటిని గుర్తించి జాగ్రత్త పడిందా అంటే లేదు. మళ్ళీ అదే తప్పు చేసింది.

nayanthara ar murugadoss

ఇటీవల వచ్చిన ‘దర్బార్’ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. రజినీ కాంత్ వంటి స్టార్ హీరో .. అలాగే రెమ్యునరేషన్ కూడా ఉండడు అని ‘దర్బార్’ సినిమా చేయడానికి ఓకే చెప్పేసినట్టుంది. కాని కట్ చేస్తే.. ఈమె పాత్రకి సినిమాలో పెద్ద ప్రాముఖ్యత ఉండదు. ఈమె పాత్రకంటే కూడా నివేదా థామస్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అసలే నయన్ తమిళంలో పెద్ద స్టార్ హీరోయిన్ అని అందరికీ తెలిసిన సంగతే. ఈ విషయం పై నయన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నిజానికి మురుగ దాస్ .. నయన్ పై తీసిన చాలా సీన్లని తొలగించాడట. ఇలా రెండోసారి కూడా నయన్ ను మోసం చేసాడు. ఇక మరోసారి నయన్ ఈ స్టార్ డైరెక్టర్ ను నమ్మే ఛాన్స్ లేదని.. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.