ఆఖరికి నయన తార కూడా అలాంటి పాత్రకి ఒప్పేసుకుందట..!

ఈ మధ్య బోల్డ్ కంటెంట్ అంటూ బూతు కంటెంట్ సినిమాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్ సీన్లు పెట్టి యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. హద్దులు మించిన లిప్ లాక్ కిస్సులు, హగ్గులు, నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కొత్త భామలనో.. బుల్లితెర పై పాపులర్ అయిన భామలనో.. హీరోయిన్లుగా ఎంచుకుంటే వారు అందాల ఆరబోతకు రొమాంటిక్ సీన్లకు చాలా వరకూ అడ్డుచెప్పారు కాబట్టి దర్శక నిర్మాతలకి అదో ప్లస్ పాయింట్..! ఇక హద్దులు దాటే రొమాన్స్ అలాగే నాలుగు బూతులతో టీజర్ విడుదల చేస్తే వివాదాలు మొదలయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో మహిళా సంఘాల వంటి వారు కూడా ధర్నాలు చెప్పట్టారు అంటే.. ఇక ఆ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచేసినట్టే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు దర్శకనిర్మాతలు.

nayantara-to-act-in-a-bold-content-movie1

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న నయనతార కూడా బోల్డ్ సినిమాలో నటించబోతుందట. ‘నెట్రికాన్’ అనే పేరుతొ రూపొందుతున్న ఈ చిత్రంలో సెక్స్, మాఫియా, రొమాన్స్, హింస వంటివి టన్నుల్లో ఉండబోతున్నాయట..! మిలింద్ రౌ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ చూస్తుంటే ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నయనతార పాత్ర ఏంటనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తుంది కానీ కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సీన్లలో నటించి అప్పట్లోనే సంచలనం సృష్టించింది నయనతార.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.