టాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్నాడు

అదృష్టం అనేది చెప్పుకు అంటిన పేడ లాంటిది. ఒక్కోసారి వద్దు అనుకొన్నా అంటుకుంటుంది.. వదిలించుకోవాలన్నా వదలదు. ప్రస్తుతం తెలుగు నటుడు టర్నడ్ బాలీవుడ్ పాపులర్ యూట్యూబర్ నవీన్ పోలిశెట్టి పరిస్థితి అలాగే తయారయ్యింది. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు మనోడ్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ముంబై వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు బాబు. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో తెలుగులో నటుడిగా, రచయితగా తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు.

naveen-polishetty-back-to-back-hits-in-tollywood-and-bollywood1

ఆ సినిమా తర్వాత నవీన్ కి టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ సక్సెస్ నుంచి ఇంకా బయటపడక ముందే నవీన్ కి బాలీవుడ్ లోనూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. నవీన్ పోలిశెట్టి కీలకపాత్ర పోషించిన “చిచోరే” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సక్సెస్ లో నవీన్ పాత్ర కూడా కాస్త భారీగానే ఉండడంతో.. ఒకేసారి టాలీవుడ్, బాలీవుడ్ లో విజయాలు సొంతం చేసుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు నవీన్ పోలిశెట్టి. ఇప్పటివరకు తన తదుపరి తెలుగు సినిమాపై ప్రకటన చేయని నవీన్.. ఇప్పుడు బాలీవుడ్ లో తనకు లభిస్తున్న రిసెప్షన్ ను బట్టి తెలుగులో మళ్ళీ సినిమా చేస్తాడా లేక బాలీవుడ్ కే ఫిక్స్ అయిపోతాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వరుస విజయాలు అందుకొన్న నవీన్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకొందాం.

Share.