నివేదా థామస్ అసలు రంగు బయట పెట్టనున్న నవీన్ చంద్ర

నాని హీరోగా యాక్ట్ చేసిన ‘జెంటిల్‌మన్’తో నివేదా థామస్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత నాని తో యాక్ట్ చేసిన మరో సినిమా ‘నిన్ను కోరి’తో సెకండ్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎంత టార్చర్ చేసినా చాలా ఓర్పు సహనంతో వ్యవహరించిన అమ్మాయిగా నటించింది. అది రీల్ లైఫ్. రియల్ లైఫ్ లో మాత్రం నిర్మాతకు నివేదా థామస్ చుక్కలు చూపించిందట. చాలా అంటే చాలా టార్చర్ పెట్టిందట.

హీరోయిన్‌గా నివేదాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చినది నాని కాదు. నవీన్ చంద్ర. తెలుగులో నివేదా ఫస్ట్ మూవీ ‘జెంటిల్‌మన్’ కాదు. నవీన్ చంద్ర హీరోగా యాక్ట్ చేసిన ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ ఫస్ట్ మూవీ. అయితే, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా షూటింగ్్ లేట్ అయ్యింది. దాంతో నాని సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యాయి. అవి హిట్ అవ్వడంతో నవీన్ చంద్ర, ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమా ప్రొడ్యూసర్స్ కి నివేదా థామస్ చుక్కలు చూపించిందంట. టాకీ పార్ట్ ఫినిష్ అయ్యిన తరవాత సాంగ్స్ షూటింగ్ చెయ్యనని టార్చర్ పెట్టిందట.

Naveen Chandra comments on Nivetha Thomas1

ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘అలీతో సరదాగా’ ప్రోగ్రామ్ లో నవీన్ చంద్ర ఈ విషయాలు అన్నీ చెప్పనున్నాడు. నివేదా థామస్ ఎంత టార్చర్ పెట్టినదీ, ఆమె నిజ స్వరూపం ఏంటనేదీ పూసగుచ్చినట్టు నవీన్ చంద్ర షోలో బయటపెట్టాడట. ఈ వీక్ ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఆల్రెడీ ప్రోమోలో దానిగురించి హింట్ ఇచ్చారు. దీనిపై నివేదా ఏమంటుందో??

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.