అలాంటి ప్రచారాన్ని పట్టించుకోవద్దు : నారా లోకేష్

ప్రభాస్ అభిమానులే కాదు యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కాబోతుంది. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనుకోకుండా ఈ చిత్రం పై రాజకీయ వివాదాలు కూడా మొదలవ్వడం గమనార్హం. ‘సాహో’ విషయంలో వివాదంగా మారుతున్న ఓ అంశం పై క్లారిటీ ఇవ్వడానికి ఏకంగా ఏపీ మాజీ సీఎం కొడుకు నారా లోకేష్ ముందుకు రావడం విశేషం.

nara-lokesh-promotes-saaho-movie

విషయం ఏమిటంటే… ఓ మీడియా సంస్థలో టిడిపి కార్యకర్తలు ‘సాహో’ చిత్రం పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే కథనం రాసుకొచ్చారు. ఈ వార్త లోకేష్ వరకూ వెళ్లడంతో ఆయన మండిపడుతూ ఓ ట్వీట్ చేశాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లోకేష్ స్పందిస్తూ… “ఇలాంటి అబద్దపు వార్తలు రాసి ఆ డబ్బుతో కనీసం అన్నం తినగలరా.’సాహో’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విజువల్ వండర్. ఈ చిత్రాన్ని చూసేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ఘనవిజయం కావాలని కోరుకుంటున్నాను. టిడిపి కార్యకర్తలు, ప్రభాస్ అభిమానులు అంతా ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి అసత్యపు ప్రచారాన్ని పట్టించుకోవద్దు” అంటూ నారా లోకేష్ పేర్కొన్నాడు.

Share.