ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది

“ఈమధ్య నాని సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి, నాని గెటప్ విషయంలో పెద్దగా కేర్ చేయడం లేదు, నాని నటనలో మార్పు రావాలి” ఈమధ్యకాలంలో నాని సినిమా విడుదలైన ప్రతిసారి వినిపించిన కామన్ కామెంట్స్ లో ఇవి కొన్ని. నిజమే.. “నేను లోకల్, మజ్ను, నిన్ను కోరి, ఎం.సి.ఏ, కృష్ణార్జున యుద్ధం” చిత్రాల్లో నాని గెటప్స్ కానీ యాక్షన్ కానీ ఇంచుమించుగా ఒకేలా ఉండడం కూడా అందుకు కారణం కావొచ్చు. కానీ. నాని అన్నీ కామెంట్స్ కి ఒకేసారి “జెర్సీ” సినిమాతో సమాధానం ఇచ్చేలా ఉన్నాడు. ఇవాళ ఉదయం విడుదలైన జెర్సీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నది ఏమిటంటే.. “నానిలో కళ్ళల్లో ఒక స్పార్క్ కనిపిస్తుంది. భలే భలే మగాడివోయ్ తర్వాత ఆ స్పార్క్ మళ్ళీ ఇప్పుడే కనిపిస్తుంది” అని.

jersey-movie-trailer-review1

jersey-movie-trailer-review2జెర్సీ ట్రైలర్ కట్ కూడా చాలా డీసెంట్ గా చేశాడు దర్శకుడు గౌతమ్. థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడికి ఇదీ కథ, ఇలా సాగుతుంది కథనం, ఇదీ సినిమా క్లైమాక్స్, ఇదీ కథానాయకుడి గోల్ అని చాలా క్లారిటీగా రెండు నిమిషాల ట్రైలర్లో చాలా చెప్పాడు. దాని బట్టి సినిమాకి వచ్చే ప్రేక్షకుడికి ఒక క్లారిటీ ఉంటుంది.. అనవసరమైన ఎక్స్ పెక్తేషన్స్ ఉండవు. సో, నానికి చాలా రోజుల తర్వాత ఒక సరైన హిట్ పడబోతోందన్నమాట. సో, ఏప్రిల్ 19న నాని “జెర్సీ”తో సూపర్ హిట్ కొట్టడం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయి

Share.