నాని టార్గెట్ చాలా ఈజీ… హిట్టు కొట్టేసినట్టే..!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. తన మేజికల్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేసే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13 న విడుదల కాబోతుంది. అంటే మరో మూడు రోజుల్లో అన్న మాట..! ఇక ఈ చిత్రంలో ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతుంది. సీనియర్ నటి లక్ష్మీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇదిలా ఉండగా… ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమా పై అంచనాలు అమాంతంగా పెరిగాయి.

gang-leader-teaser-on-24th-july

నైజాం – 8 కోట్లు
సీడెడ్ – 3.6 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.5 కోట్లు

nanis-gang-leader-movie-trailer-review1
గుంటూరు – 1.8 కోట్లు
ఈస్ట్ – 1.6 కోట్లు
కృష్ణా – 1.45 కోట్లు

nanis-gang-leader-movie-trailer-review2
వెస్ట్ – 1.20 కోట్లు
నెల్లూరు – 0.75 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ

nanis-gang-leader-teaser1
టోటల్ – 20.90 కోట్లు
ఓవర్సీస్ – 5.55 కోట్లు
————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 28.20 కోట్లు
————————————————–

first-look-of-nanis-gangleader-raises-curiosity

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రానికి 28.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 29 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. నానికి ఉన్న మార్కెట్ బట్టి అది పెద్ద కష్టమేమీ కాదు. నాని గత చిత్రం ‘జెర్సీ’ కూడా 28 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. ఎటొచ్చి ఓవర్సీస్ లో మాత్రం గట్టిగా అమ్మారు. అక్కడ 5.55 కోట్ల షేర్ ను రాబట్టాలి అంటే 2 మిలియన్ కొట్టాల్సిందే. కానీ నాని సినిమా ఇప్పటి వరకూ అంత కలెక్ట్ చేసింది లేదు. అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాలకి కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది కాబట్టి కొంచెం ఛాన్సులు ఉన్నాయి. మరి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Share.