గ్యాంగ్ లీడర్ సినిమాకి సెన్సార్ రివ్యూ

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. తన మేజికల్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేసే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంలో ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది.

nanis-gang-leader-movie-censor-review1

హీరో నాని లేడి గ్యాంగ్ తో చేసే కామెడీ, డైరెక్టర్ విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే, విలన్ గా కార్తికేయ యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అవుతాయని, ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ గా సినిమా చాలాబాగుందని సెన్సార్ సభ్యులు పొగిడేశారట. ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమాపైన భారీ అంచనాలే ఉండగా హీరో నాని ఖాతాలో మరొక హిట్ గ్యారెంటీ అని అంటున్నారు.

Share.