నాని కొత్త సినిమాకి.. మణిరత్నం ‘ఘర్షణ’ టచ్..!

నేచురల్ స్టార్ నాని.. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు ఇవ్వలేకపొతున్నాడు. నాని నటించిన గత 5 సినిమాల ఫలితాలను ను ఒక్కసారి గమనిస్తే.. ఒక్క ‘జెర్సీ’ తప్ప మరో హిట్టు కనిపించదు. ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తాజాగా వచ్చిన ‘వి’ వంటి సినిమాలు మంచి ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నాని అభిమానుల ఆశలన్నీ ‘టక్ జగదీష్’ పైనే పెట్టుకున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

అక్టోబర్ నుండీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. గతంలో నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్ను కోరి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ‘మజిలీ’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘టక్ జగదీష్’ పై మొదటి నుండీ మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.1988 వ సంవత్సరంలో వచ్చిన దర్శకుడు మణిరత్నం ‘ఘ‌ర్ష‌ణ‌’ చిత్రం స్ఫూర్తితోనే ‘టక్ జగదీష్’ ను తెరకెక్కిస్తున్నాడట శివ నిర్వాణ.

స‌వ‌తి సోద‌రుల మధ్య ఏర్పడే సంఘర్షణే ఈ చిత్రం కథ అని తెలుస్తుంది. కార్తీక్, ప్రభు ల ప్లేస్ ల లో నాని, జ‌గ‌ప‌తిబాబు కనిపిస్తారని సమాచారం. అయితే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుందని.. నాని, జగపతి బాబు ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని తెలుస్తుంది. ఈ చిత్రమైన సూపర్ హిట్టయ్యి నానికి పెద్ద రిలీఫ్ ఇస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Share.