నానికి షాక్ ఇచ్చిన కరోనా..!

నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం తిరిగి షూటింగ్లకు అనుమతులు ఇవ్వడంతో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యింది. అయితే మొదలైన కొద్ది రోజులకే..మళ్ళీ షూటింగ్ కు బ్రేక్ పడిందనేది తాజా సమాచారం.

దీనికి ప్రధాన కారణం.. చిత్ర యూనిట్ సభ్యులలో కీలకమైన ఇద్దరు టెక్నీషియన్లు కరోనా సోకడమే అని తెలుస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. శానిటైజేషన్ వంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో అంతా కంగారుపడుతున్నారట. ‘టక్ జగదీష్’ చిత్రం యూనిట్ సభ్యులందరికీ షూటింగ్ మొదలుపెట్టే ముందే కోవిడ్ టెస్టులు చేశారట.

అయినప్పటికీ ఇద్దరికి కరోనా సోకింది.మీడియం రేంజ్ హీరోల సినిమాలకే ఇలా ఉంటే.. ఇక స్టార్ హీరోల సినిమాలకు ఇంకెంత ఇబ్బంది ఎదురవుతుందో.! అందుకేనేమో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఇంకా షూటింగ్లు మొదలుపెట్టడం లేదు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.