నానితో నెక్స్ట్ సినిమా అని సంబరపడుతున్న రాహుల్ కి షాక్!

“చిలసౌ” సినిమాతో దర్శకుడిగా మారి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్న రాహుల్ రవీంద్రన్ కు ద్వితీయ విఘ్నం కారణంగా “మన్మధుడు 2″తో సరైన హిట్ అందుకోలేకపోయాడు. దాంతో “చిలసౌ” టైమ్ లో రాహుల్ రవీంద్రన్ ను మెచ్చుకొన్నవాళ్ళందరూ.. “మన్మధుడు 2” రిలీజ్ తర్వాత కనీసం పట్టించుకోవడం మానేశారు. నిజానికి “చిలసౌ” తర్వాత రాహుల్ దర్శకత్వంలో పని చేసేందుకు నాని ఆసక్తి చూపిస్తున్నాడని వార్తలు వచ్చినప్పటికీ.. అప్పటికి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

nani-shocks-rahul-ravindran1

కానీ.. “మన్మఢుడు 2” రిజల్ట్ తర్వాత ఇప్పుడు రాహుల్ తన తదుపరి చిత్రం నానితో అని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. అందుకు కారణం నాని ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉండడమే కాక తదుపరి చిత్రాలను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశాడు. సో, ఇండైరెక్ట్ గా రాహుల్ ని రిజెక్ట్ చేసినట్లే. మరి నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన రాహుల్ రవీంద్రన్ నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Share.