నాని తెలివిగా ఇద్దరినీ భలే పొగిడాడే.. !

నాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సంక్రాంతి హీరోలను ప్రశంసించారు. అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇద్దరు హీరోలు బన్నీ, మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు. యూఎస్ లో కూడా ఈ రెండు చిత్రాలు కలిపి రెండు రోజులో $3 మిలియన్ డాలర్స్ వసూళ్లను దాటివేశాయి.సరిలేరు నీకెవ్వరు $2 మిలియన్ డాలర్స్ వసూళ్లకు చేరువ అవుతూ ఉండగా సరిలేరు నీకెవ్వరు $1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లకు దగ్గరైంది.

ala-vaikunthapurramloo-vs-sarileru-neekevvaru

ఈ నేపథ్యంలో నాని ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ విజృంభించారంటే..ఈ ఏడాది టాలీవుడ్ బాక్సపీస్ కల్లెక్షన్స్ తో కళకళలాడటం ఖాయం..రెండు టీమ్స్ కి కంగ్రాట్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నాని ఎవ్వరి పేర్లు చెప్పకుండానే…ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మహేష్, బన్నీ అని అర్థం వచ్చేలా వారిని పొగడటంతో పాటు శుభాకాంక్షలు కూడా చెప్పేశాడు. ఇక నాని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో చేస్తున్న ‘వి’ చిత్రీకరణ చివరి దశకు చేరింది. ఉగాది కానుకగా మార్చ్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే ఓ చిత్రం చేయనున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.