మరో కొత్త ప్రయోగంతో నాగార్జున సినిమా..!

‘బిగ్ బాస్ సీజన్3’ కారణంగా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ‘కింగ్’ నాగార్జున. ‘మన్మధుడు2’ షూటింగ్ సమయంలోనే ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన స్క్రిప్ట్ లో నాగార్జున కొన్ని మార్పులు చెప్పడం.. వాటిని కళ్యాణ్ సరిగ్గా డెవలప్ చేయకపోవడమే ఇందుకు కారణమని టాక్ నడుస్తుంది. ఏమైనా కొంచెం గ్యాప్ తీసుకుని బాగా డెవలప్ చేసుకురమ్మని నాగార్జున చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నాగార్జున సాల్మన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Nagarjuna With Kajal

నాగ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున హీరో కాదట. కానీ ఈ చిత్రం కథ మాత్రం ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుందనేది తాజా సమాచారం. అంటే ‘ఊపిరి’ ‘రాజుగారి గది 2’ లో మాదిరి అన్న మాట. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ఓ యువ జంట కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ యువ జంటలో.. హీరో తెలిసిన వ్యక్తే ఉంటాడని… హీరోయిన్ గా మాత్రం ఓ కొత్త అమ్మాయిని తీసుబోతున్నారని ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి త్వరలో త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించబోతున్నారనేది వారి సమాచారం.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.