మల్టీస్టారర్ కి నాగ్ ఓకే చెప్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరికోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకి వెళ్లడం చాలా కామన్. ఇప్పుడు బాలయ్య, నాగార్జున విషయంలో అదే జరిగింది. బాలయ్య కోసం అనుకున్న పాత్రలో ఇప్పుడు నాగార్జునను నటించమని అడుగుతున్నారట. అసలు విషయంలోకి వస్తే.. ఆ మధ్య యంగ్ హీరో నాగశౌర్య దగ్గరకు ఓ కథ వచ్చింది. యువ దర్శకుడు చెప్పిన ఆ కథ శౌర్యకు బాగా నచ్చింది. అయితే అందులో ఓ స్టార్ హీరోకి సరిపడే పాత్ర కూడా ఉంది. దాన్ని నందమూరి బాలకృష్ణతో చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు.

ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. అప్పట్లో బాలయ్య కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో బాలకృష్ణ -శౌర్య కాంబినేషన్ లో మల్టీస్టారర్ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాలయ్య చేయడం లేదని తెలుస్తోంది. రీసెంట్ గా గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి అంగీకరించాడు బాలయ్య. మైత్రి బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడు.

దాంతో శౌర్య సినిమా చేసే సమయం లేక.. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు బాలయ్య. ఇప్పుడు ఆ పాత్రను నాగార్జునతో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ కథ పట్టుకొని నాగ్ దగ్గరకు వెళ్లనున్నారు. ప్రస్తుతం నాగార్జున కూడా చాలా బిజీగా ఉన్నారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసి.. ప్రవీణ్ సత్తారు సినిమా మొదలుపెట్టాడు. లైన్లో ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ కూడా ఉంది. కానీ అతడికి మల్టీస్టారర్ సినిమాలంటే మక్కువ. కాబట్టి నాగశౌర్యకి నచ్చిన కథ తనకు కూడా నచ్చితే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.