నాగార్జున ధీమా అందుకేనా..?

చాలా కాలంగా చర్చల దశలోనే ఉండిపోయిన సినిమా ‘బంగార్రాజు’పై ఇటీవల నాగార్జున కీలక ప్రకటన చేశాడు. మరికొన్ని నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలనేది తన ప్లాన్ అని నాగార్జున చెప్పారు. నిజానికి ఈ సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలనుకున్నామని.. కానీ కుదరలేదని వచ్చే సంక్రాంతికి మాత్రం సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నిజానికి నాగ్ ఈ ప్రకటన చేయడానికి ముందే 2022 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి నిర్ణయించుకున్నాయి.

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, అలానే పవన్-క్రిష్ సినిమాని 2022 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లు పవన్, మహేష్ బాబు సినిమాలు క్లాష్ కి దిగుతున్నాయంటే మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరి హీరోల్లో ఒకరి సినిమా రిలీజ్ అవుతున్నా.. వేరే సినిమాలు పోటీకి రావడానికి భయపడతాయి. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తుంటే దరిదాపుల్లోకి కూడా మరో సినిమా రాదు.

అలాంటిది నాగార్జున మాత్రం తన సినిమాను కూడా అప్పుడే రిలీజ్ చేస్తానని చెప్పేశాడు. అయితే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడుతాయని.. వేరే సినిమాలు ఎన్ని పోటీలో ఉన్నా ఇబ్బంది లేదనేది నాగార్జున ఫీలింగ్. 2016 సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని విడుదలైనా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. కాబట్టి ‘బంగార్రాజు’కి కూడా మంచి రిజల్ట్ వస్తుందని నాగ్ ధీమాగా ఉన్నాడని చెబుతున్నారు. అయినా.. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలుకాలేదని.. పూర్తయితే అప్పుడు సంక్రాంతి రిలీజ్ గురించి మాట్లాడొచ్చని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.