నాగార్జున మహేష్ చేసిన పనికి హర్ట్ అయ్యాడట..!

అవును మహేష్ పై నాగార్జున గుర్రుగా ఉన్నాడట. దీనికి ప్రధాన కారణం దర్శకుడు పరశురామ్ అలాగే నాగ చైతన్య అని తెలుస్తుంది. నిజానికి పరశురామ్ … నాగ చైతన్య తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి నాగేశ్వరరావు అనే టైటిల్ అనుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా మహేష్ దగ్గర్నుండి కాల్ రావడంతో పరశురామ్ .. చైతూ సినిమా చెయ్యలేను అని చెప్పి అడ్వాన్స్ నిర్మాతలు అయిన 14 రీల్స్ వారికి ఇచ్చేసాడట.

కాని ఇందుకు వారు ఒప్పుకోలేదు.మహేష్ తో చేస్తున్న సినిమాని ‘మైత్రి’ వారు నిర్మిస్తుండగా.. వారితో కలిసి ’14 రీల్స్’ వారు కూడా జాయిన్ అవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ విషయం నాగార్జున వద్దకు వెళ్లింది. ‘మహేష్ సినిమా కోసం తన కొడుకుని పక్కన పెట్టడం ఏంటి.. అదీ అందరూ కలిసిపోయి.. ‘ అని మండిపడ్డారట.

Nagarjuna Serious on Mahesh Babu1

చైతూ తో సినిమా అని అధికారిక ప్రకటన చేసిన తర్వాత కూడా మహేష్ మళ్ళీ పరశురామ్ కు కాల్ చేయడం ఏంటి? అని ఘాటుగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చైతూ లైట్ తీసుకుని శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లవ్ స్టోరీ’ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే చైతన్య తో సినిమాలు చెయ్యడానికి కూడా చాలా మంది డైరెక్టర్ లు, నిర్మాతలు వెయిట్.చేస్తున్నారు కాబట్టి అతను లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.