నాగార్జున బిగ్ బాస్ షోకు దూరమవుతున్నారా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 1 కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించడంతో పాటు సీజన్ 1 సక్సెస్ కావడంతో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో సీజన్ 2కు నాని హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 2 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్నేళ్ల క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లకు కూడా హోస్ట్ గా వ్యవహరించారు.

బిగ్ బాస్ సీజన్ 5కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయకపోవచ్చని తెలుస్తోంది. వరుస సినిమాలతో నాగార్జున బిజీగా ఉండటం వల్ల ఈ సీజన్ కు బిగ్ బాస్ నిర్వాహకులు వేరే స్టార్ హీరోను తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 5ను జూన్ లేదా జులై నెలలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5కు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని సోషల్ మీడియా సెలబ్రిటీలకే ఈ సీజన్ లో ఎక్కువగా ఛాన్స్ ఉండనుందని సమాచారం. షణ్ముఖ్ జశ్వంత్, దీపికా పిల్లి, న్యూస్ యాంకర్ రోజా, హైపర్ ఆది, యాంకర్ రవి, మరికొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న పేర్లలో సీజన్5 ప్రారంభం నాటికి మార్పులు ఉండే అవకాశం ఉంది.

బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి సీజన్ లో చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి కొందరు సెలబ్రిటీలను మాత్రమే ఫైనలైజ్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 4 సమయంలో కరోనా విజృంభణ వల్ల పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఆ షోలో పాల్గొనలేదు. సీజన్ 5లో మాత్రం ఎక్కువ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలకే బిగ్ బాస్ నిర్వాహకులు ఛాన్స్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.