‘జబర్దస్త్’ నుండీ నాగబాబు తప్పుకోవడానికి కారణాలు..?

బుల్లితెర పై ‘జబర్దస్త్’ సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టి.ఆర్.పి విషయంలో ఈ కామెడీ షో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో కూడా ఈ షో కు సంబందించిన ప్రతీ ఎపిసోడ్ కు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఇక ఈ షోలో ప్రత్యేక ఆకర్షణ ఏమైనా ఉంటే.. అందులో జడ్జి నాగబాబు గారి నవ్వు కూడా ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆయన ఈ షో నుండీ తప్పుకుంటున్నారు అనే విషయం పై వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల ఈ షో లో కమెడియన్ అయిన అదిరే అభి కూడా ఈ విషయం పై సరైన క్లారిటీ ఇవ్వలేను అని చెప్పడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయనే చెప్పాలి.

2naga-babu

అయితే ఈ షో నుండీ నాగబాబు ఎందుకు తప్పుకోవడానికి రెడీ అయ్యారు? షో నిర్వాహకులతో ఆయనకి ఏమైనా మనస్పర్థలు వచ్చాయా… ? అంటూ ఈ విషయం పై కూడా తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం జబర్దస్త్ కామెడీ షోని మొదట నితిన్ – భరత్ అనే ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ చేసేవారట. అనుకోకుండా.. మూడు నెలల క్రితం… వారు ఈ షో నుండీ తప్పుకున్నారట. అటు తర్వాత ‘జబర్దస్త్’ దర్శకత్వం బాధ్యతలు నాగబాబు మీద పడ్డాయని తెలుస్తుంది. ఓ వైపు జడ్జిగా వ్యవహరించడం… మరోవైపు డైరెక్షన్ చేయడం రెండూ నాగబాబుకు ఇబ్బందిగా మారాయని తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో మరో ఛానల్ నుండీ నాగబాబు కి ఆహ్వానం రావడంతో వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తుంది.సో నితిన్, భరత్ లు వెళ్ళిపోవడం వల్లే ‘జబర్దస్త్’ కు నాగబాబు దూరమవ్వబోతున్నారని తెలుస్తుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.