‘అశ్వద్ధామ’ విషయంలో జోరు పెంచిన నాగ శౌర్య..!

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశ్వద్దామ’. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ‘ఐరా క్రియేషన్స్’ వారు నిర్మిస్తున్నారు. జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ మరియు టీజర్ లకు అద్భుతమైన స్పందన లభించింది. అంతేకాదు సినిమా పై అంచనాల్ని రెట్టింపు చేశాయనే చెప్పాలి.

Naga Shaurya Started Dubbing For Aswathama

ఇక విడుదల తేదీకి నెల పైనే సమయం ఉన్నప్పటికీ.. చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఫాస్ట్ గా అన్ని పనులు పూర్తిచేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా హీరో నాగ శౌర్య డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసాడు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలే తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని ఫిలింనగర్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Share.