శౌర్య ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందా..?

చాలా రోజులుగా నాగశౌర్యకి సంబంధించిన ఓ ప్రాజెక్ట్ వార్తల్లో నలుగుతోంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ శౌర్యకి బాగా నచ్చింది. శివలెంక కృష్ణ ప్రసాద్ అనే బడా నిర్మాత ఈ కథను నిర్మించాలని చూస్తున్నారు. ఇది ఇద్దరు హీరోల కథ. ఓ పాత్ర కోసం అగ్ర హీరో కావాల్సివుంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కి, హీరో బాలకృష్ణకి మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ లాంటి సినిమాలను నిర్మించింది ఈయనే. అయితే ‘మిత్రుడు’ సినిమాతో నష్టాలు ఎక్కువగా రావడంతో.. అప్పటినుండి శివలెంక కృష్ణప్రసాద్ కు మరో సినిమా చేసి పెట్టాలని బాలకృష్ణ అనుకుంటూనే ఉన్నారు.

అందుకే ఈ ఈ కథ ముందుగా బాలయ్య దగ్గరకు వెళ్లింది. ఈ సినిమాలో నటిస్తానని బాలయ్య కూడా మాటిచ్చాడు. కానీ తన బిజీ కాల్షీట్ల వలన బాలయ్యకు కుదరడం లేదు. దీంతో ఈ కథ నాగార్జున దగ్గరకు వెళ్లింది. నాగ్ కూడా ముందు ఓకే చెప్పినా.. ఇప్పుడు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నాగ్ చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి. ముందుగా.. ప్రవీణ్ సత్తారు సినిమాను పూర్తి చేయాలి. ఆ తరువాత ‘బంగార్రాజు’ సినిమా లైన్ లో ఉంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా జూన్ లో బిగ్ బాస్ కూడా మొదలవుతోంది. దానికి కూడా కాల్షీట్లు కేటాయించాలి. ఎలా చూసుకున్నా.. శౌర్యతో సినిమా చేయడానికి నాగ్ కి కుదరడం లేదు. దీంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మళ్లీ బాలయ్య దగ్గరికే వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగైనా తనకు ఈ సినిమా చేసి పెట్టాలని నిర్మాత కోరుతున్నాడట. శౌర్య కూడా ఈ సినిమా విషయంలో ఉత్సాహం చూపిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.