అభిమాని చేసిన పనికి షాక్ తిన్న చైతు!

అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ హీరో ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది చైతు కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతోంది. దీంతో తమ అభిమాన హీరోని చూడడానికి షూటింగ్ సెట్స్ కి తరలివస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

షూటింగ్ స్పాట్ వద్ద గుంపులు గుంపులుగా చేరారు. దీంతో నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులను కలిసి వారితో ఫోటోలు దిగాడు. అయితే ఓ అభిమాని చేసిన పనికి మాత్రం చైతు షాకయ్యాడు. షూటింగ్ లో భాగంగా నాగచైతన్యతో నదిలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తోన్న సమయంలో అక్కడకి వచ్చిన ఓ వీరాభిమాని చైతుని చూడడానికి ఏకంగా నదిలోకి దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే షూటింగ్ మధ్యలోనే అభిమాని నదిలోకి దూకడంతో షూటింగ్ కి అంతరాయం కలిగింది. దీంతో డైరెక్టర్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తరువాత చైతు సదరు అభిమానిని కలిసి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి.. కాసేపు అతడితో మాట్లాడి.. ఫోటో దిగి పంపించేశాడు. తన అభిమాన హీరోని కలిసే ఛాన్స్ వచ్చినందుకు ఆ ఫ్యాన్ తెగ మురిసిపోతున్నాడు.


Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.