‘లవ్ స్టోరీ’ తో వస్తున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

అక్కినేని హీరో నాగ చైతన్య ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి తొలిసారిగా నాగ చైతన్యకు జంటగా నటిస్తుండగా దర్శకుడు ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నాగ చైతన్య పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. ఓ ఫిట్ నెస్ సెంటర్ లో పనిచేస్తూ సాదా సీదా బట్టలలో చాలా ఆర్డినరీ బాయ్ గా ఉన్న నాగ చైతన్య లుక్ ఆసక్తిరేపింది. గతంలో నాగ చైతన్య ఎన్నడూ చేయని ఓభిన్నమైన రోల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.

కాగా నేడు ఈ చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేశారు . శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే యూత్ ఫుల్ టైటిల్ నిర్ణయించారు. ఇక పోస్టర్ లో నాగచైతన్య, సాయి పల్లవి ఒకరంటే ఒకరికి అమిత ప్రేమ కలిగిన జంటగా కనిపిస్తున్నారు. ప్రేమలో డీప్ గా మునిగిపోయిన ఇద్దరు ప్రేమికుల ఘాడమైన ప్రేమకథను శేఖర్ కమ్ముల హృద్యంగా చెప్పాడు అనిపిస్తుంది. టైటిల్ పోస్టర్ తోనే శేఖర్ కమ్ముల మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. గత ఏడాది మజిలీ చిత్రంలో భగ్న ప్రేమికుడిలా నటించి మెప్పించిన నాగ చైతన్య మరో ఛాలెంజింగ్ రోల్ కి సిద్దమైనట్లు తెలుస్తుంది. నారాయణ దాస్ కె నారంగ్, పి రామ్ మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.