టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న బోణీ కపూర్

“మజిలీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య.. త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాలో తెలంగాణ కుర్రాడిగా కనిపించడం కోసం సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అయితే.. ఆ సినిమా తర్వాత నటించబోయే చిత్రాన్ని చైతూ సైన్ చేశాడని తెలుస్తోంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “బాదాయ్ హో” తెలుగు రీమేక్ లో నాగచైతన్య నటించనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ 100 కోట్లకు పైన వసూలు చేసింది.

naga-chaitanya-roped-for-a-bollywood-superhit-movie-remake1

ఈ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ కూడా తెలుగులో డెబ్యూ చేయనున్నాడు. ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి బోణీ కపూర్ నిర్మించనున్నాడు. దర్శకుడు ఎవరు, ప్రధాన తారాగణం ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. ఈ రీమేక్ సినిమాలో నటించడం అనేది చైతన్యకి బాగా కలిసొచ్చే విషయం.

Share.