మళ్ళీ చైతన్య వద్దకు తిరిగొచ్చిన అజయ్ భూపతి..!

‘ఆర్‌.ఎక్స్.100` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కాబట్టి ఈ డైరెక్టర్ చెప్పే కథ వినడానికి ప్రతీ హీరో టైం ఇస్తున్నాడు కానీ… కథ విన్న వారెవరూ ఛాన్స్ మాత్రం ఇవ్వట్లేదు. మొదటి చిత్రం వచ్చి సంవత్సరం దాటేసినా.. ఇంకా అజయ్ భూపతి రెండో సినిమా మొదలుకాలేదు. ‘మహాసముద్రం’ పేరుతో కథను రెడీ చేసుకున్నాడు… ఓ దశలో మాస్ మహారాజ్ రవితేజ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసారు. మరో హీరోగా సిద్దార్థ్ ను కూడా సంప్రదించారు. ఆయన కూడా ఓకే చేశాడు. కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో రవితేజ ఈ సినిమాని పక్కనబెట్టి వేరొక సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.

naga-chaitanya-ajay-bhupathi-ravi-teja1

దీంతో అజయ్ భూపతికి చిర్రెత్తుకొచ్చి ‘చీప్ స్టార్’ అని తన సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు ఇదే కథని పట్టుకుని అజయ్ భూపతి… నాగచైతన్య వద్దకు వచ్చాడట. నిజానికి రవితేజ కంటే ముందే నాగచైతన్యకు ఈ కథను వినిపించాడు. సమంత కూడా ఈ కథ వినిందట. అయితే చైతన్య ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేయమని సూచించిందట. తన భార్య మాటతో ఏకీభవించిన చైతన్యకు అలా కానివ్వమని చెప్పాడట. ఈలోగా కంగారు ఆగక రవితేజ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు చైతన్య చెప్పిన మార్పులు చేస్తాడా.. ఒకవేళ చేసిన చైతన్య ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ చైతన్య కూడా ఓకే చెయ్యకపోతే మరోసారి ‘చీప్ స్టార్’ అని ట్వీట్ చేస్తాడా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Share.