ఆకట్టుకుంటున్న ‘మజిలీ’ టీజర్..!

పెళ్ళైన తరువాత మొదటి సారి కలిసి నటిస్తున్నారు ‘చైసామ్’. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మజిలీ’ చిత్ర టీజర్ ని ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేసారు. ఈ చిత్రంలో క్రికెటర్ గా… లవ్ ఫెయిల్యూర్ అవ్వడంతో తాగుడి కి బానిసైన ఓ యువకుడు పాత్రలో చైతూ కనిపిస్తుంటే… భర్తని కంటికి రెప్పలా చూసుకుంటున్న సతీమణి పాత్రలో సమంత కనిపిస్తుంది.

majili-movie-teaser-review1

majili-movie-teaser-review2

‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను… ఈలోగా నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. చైతూ క్రికెటర్ గా ఉండే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమికురాలి పాత్రలో దివ్యాంశా కౌశిక్‌ కనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. ‘ఒక్కసారి పోతే.. మళ్ళీ తిరిగి రాదు రా… అది వస్తువైనా.. మనిషైనా’ అంటూ నచ్చచెప్పి సమంతతో పెళ్ళి చేస్తారు. కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక భార్యని ఇబ్బంది పెడుతుంటాడు చై . ‘నువ్వు నా రూమ్ లోకి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు’ అంటూ చైతు.. సమంతతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. దివ్యాంశా కౌశిక్‌ తో ఉండే లిప్ లాక్ కూడా టీజర్లో హైలెట్ అని చెప్పొచ్చు. గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చివర్లో ‘వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేసావ్’ అంటూ పోసాని చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ‘నిన్నుకోరి’ ఛాయలు కనిపించినప్పటికీ.. టీజర్ ఆకట్టుకునేలానే కట్ చేసారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.

Share.