8కోట్ల డీల్ ను క్యాన్సిల్ చేయించిన అల్లరి నరేష్..!

‘ఎస్.వి2 ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మాణంలో విజయ్ కనకమేడల దర్శత్వం వహించిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఇక ప్రియదర్శి, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న అంటే రేపు ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందనే లభించింది. ఈ మధ్య కాలంలో హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు అల్లరి నరేష్.

ఈ ఏడాది అతని నుండీ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. అదీ కాక ఇతను హిట్టుకొట్టి 9 ఏళ్ళు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ చిత్రంతో హిట్టు కొట్టాలని అల్లరి నరేష్ ట్రై చేస్తున్నాడట. అందులో భాగంగా… ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని రూ.8కోట్ల ఆఫర్ వస్తే.. దానిని వద్దని క్యాన్సిల్ చేయించాడట నరేష్.థియేట్రికల్ రిలీజే ఇవ్వాలని ముందు నుండీ పట్టుబట్టాడట. నిజానికి ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్(ఇంట్రెస్ట్ లతో కలిపి) రూ.7కోట్లని తెలుస్తుంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే.. థియేట్రికల్ రైట్స్ రూ.2.7కోట్లకు విక్రయించారట.

డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో 4కోట్లు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. డబ్బింగ్ రైట్స్ రేటు ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. అయితే సినిమా విడుదలయ్యాక వీటికి డిమాండ్ పెరుగుతుంది అని దర్శకనిర్మాతలు నమ్మకం పెట్టుకుని వెయిట్ చేస్తున్నారట.లేదంటే కనుక ఈ రేటుకే ఫైనల్ చేసేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే నిర్మాతకి పెట్టింది పెట్టినట్టు వెనక్కి తిరిగి వచ్చేస్తుందన్న మాట.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.