‘చెక్’ డైరెక్టర్ తో మైత్రి సినిమా చేస్తుందా..?

ఇండస్ట్రీలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి ఉన్న గుర్తింపే వేరు. సరికొత్త కథలను ప్రేక్షకులకు చెప్పాలని పరితపించే దర్శకుల్లో యేలేటి ముందుంటారు. ఆయన దగ్గర పని చేసిన చాలా మంది సహాయకులు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. కానీ యేలేటి కెరీర్ మాత్రం అంతంత మాత్రంగా సాగుతుంది. ఒక సినిమా సెట్ చేసుకోవడానికి ఆయన చాలా కష్టపడుతుంటారు. చాలా కాలంగా ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నిర్మాతలు దొరక్క ‘ప్రయాణం’ సినిమాను ఆయనే నిర్మించుకున్నారు.

ఆయన డైరెక్ట్ చేసిన ‘మనమంతా’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. కమర్షియల్ గా సినిమా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఆయన మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ లో ‘చెక్’ అనే సినిమా చేశాడు. యేలేటిపై నమ్మకంతో మంచి బడ్జెట్ లో ఈ సినిమా తీశారు నిర్మాత. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రెండు, మూడు రోజులు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తరువాత చతికిల పడింది.

యేలేటి కెరీర్ లో ఈ సినిమా డిజాస్టర్ అంటూ తేల్చేశారు. ‘చెక్’ లాంటి ప్లాప్ సినిమా తీసిన తరువాత యేలేటికి మరో ఛాన్స్ దొరుకుంతుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘చెక్’ సినిమా కంటే ముందు మైత్రి మూవీ మేకర్స్ తో యేలేటికి ఓ కమిట్మెంట్ ఉంది. ‘చెక్’ బాగా ఆడితే ఒక స్టార్ హీరోతో యేలేటి దర్శకత్వంలో సినిమా చేయాలని మైత్రి నిర్మాతలు భావించారు. కానీ ‘చెక్’ రిజల్ట్ తేడా కొట్టడంతో మైత్రి ఇప్పుడు యేలేటికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.