ఉపాసన కొణిదెల.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ.. ఎంతో సామాన్యంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. తన భర్త కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ తో పాటు.. అతని ఫిట్నెస్ సీక్రెట్స్ వంటివి అభిమానులకు తెలియజేస్తుంటుంది ఉపాసన. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ లో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన.. ఈ కరోనా క్రైసిస్ టైములో ఎంతో మంది పేద సినీ కళాకారులకు ఫ్రీగా మందులు అందచేసింది. ఇక పశువుల పెంపకం.. గురించి తెలుసుకుంటున్నట్టు తెలియజేసి.. పేడ ఎత్తడం వంటి పనులను కూడా చేస్తున్న ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అక్కడితో అయిపోలేదు.. టాయిలెట్ పొజిషన్ ఎలా ఉండాలో కూడా తెలుపుతూ.. కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఆమె గట్స్ అండ్ సింప్లిసిటీ ఏమిటన్నది.. వీటిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాలను పక్కన పెడితే.. ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఉపాసన మాట్లాడుతూ.. “నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్” అంటూ చెప్పి షాకిచ్చింది.

అంతేకాకుండా.. ‘ప్రతి ఇంట్లో మగవారు మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి ప్రార్థనలు చేయకూడదు. అలాంటి వాళ్ళు పూజ నుండీ దేవి ఫొటోలను తీసేయ్యాలని’ చెప్పుకొచ్చింది . ఈ ప్రోమో చూసిన వాళ్ళు ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.