అఖిల్ బ్యాచ్‌లర్ కష్టాలు!

దసరా కానుకగా హీరోలంతా కూడా తమ కొత్త సినిమాల అనౌన్స్మెంట్ చేయడం అలానే తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్ లు, ట్రైలర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా తన కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టీజర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రీటీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు టీజర్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. చాలా మందిని పెళ్లిచూపులు చూసిన హీరో ‘మీ మ్యారీడ్ లైఫ్ నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని’ అడుగుతుంటాడు. అందరూ రకరకాల సమాధానాలు చెబుతుంటారు.

దీంతో విసిగిపోయిన అఖిల్.. ‘కొంచెం వైల్డ్ గా థింక్ చేయ్.. డార్లింగ్’ అంటూ చెప్పగానే.. హీరోయిన్ పూజాహెగ్డే.. ‘నాకు కాబోయేవాడు నా షూస్ తో సమానం’ అంటూ ఓ స్టేజ్ పై అందరికీ చెబుతుంది. పూజాని చూసి ఇష్టపడిన అఖిల్ ఆమె చుట్టూ తిరుగుతుండడం, అందరినీ అడిగినట్లే ఆమెని కూడా పెళ్లి నుండి మీరేం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అడుగుతాడు. దానికి ఆమె ‘ఇడ్లీ.. వడా.. సాంబార్’ అంటూ అఖిల్ మొహం మీదే డోర్ వేసేస్తుంది.

టీజర్ మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్ గా కట్ చేశారు. టీజర్ మొత్తానికి గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.


కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.