మోసగాళ్ళు’ ట్రైలర్ : ”డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేంకాదు”

మంచు విష్ణు, రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ మోసగాళ్ళు’. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ”డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా..

ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని” అంటూ హీరో మంచి విష్ణు చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. ”ప్రతీవాడికి సిటీ మొత్తం కనిపించేంత పైనుండాలనేదే కోరిక.. మనం పైన ఉన్నప్పుడు ఏం చేస్తామో.. దాని బట్టి మనం ఎంతకాలం పైనుంటామనేది డిసైడ్ అవుతుంది” అంటూ నటుడు నవదీప్ పలికిన డైలాగ్ సమాజంలో నేటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ”లక్ష్మీదేవి ఎందుకంత రిచ్చో తెలుసా..? నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి” అనే డైలాగ్ చెబుతూ ట్రైలర్ లో కాజల్ ఎంట్రీ ఇచ్చింది.

దాదాపు 2600 కోట్ల స్కామ్ చేసి ఇండియన్ ఎకానమీని దెబ్బ కొట్టిన ముఠాను పట్టుకునే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది. ట్రైలర్ లో చూపించ సన్నివేశాలన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తున్నాయి. శ్యామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేస్తుంది. దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.