బిగ్‌బాస్‌పై మోనాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

బిగ్‌బాస్‌ మొత్తం నాలుగు సీజన్లలో… అందాల ఆరబోత, గ్లామర్‌ ప్రదర్శన, హాట్‌నెస్‌ ఎక్కువగా కనిపించిన సీజన్‌ ఏది అంటే నాలుగో సీజన్‌ అనే చెప్పాలి. అంతకుముందు సీజన్లలోనూ ముద్దుగుమ్మలు ఉన్నా… నాలుగో సీజన్‌లో పండినంత అందాల ప్రదర్శన, ముద్దు ముచ్చట్లు మిగిలిన సీజన్లలో లేవనే చెప్పాలి. అందుకు కారణం కంటెస్టెంట్లు జంటలుగా విడిపోయిన సందర్భాలు తక్కువ కావడమే. ఇంట్లో ఉన్నన్ని రోజులూ అందాల ఆరబోత విషయంలో అడ్డు చెప్పిన మోనల్‌.. బయటికొచ్చాక తొలిసారి వస్త్రధారణ గురించి స్పందించింది.

బిగ్‌బాస్‌లోకి వచ్చిన కొద్ది రోజులకే అఖిల్‌తో జట్టు కట్టింది మోనాల్‌. ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు హగ్గులు ఇచ్చుకుంటారో తెలియక అభిమానులు ఆ జంటను అలా చూస్తూ ఉండిపోయారు. మధ్య మధ్యలో చక్కగా క్లీవేజ్‌ షో చేస్తూ అందాలతో అలరించింది మోనాల్‌. ఓ వీకెండ్‌లో అయితే లోనెక్‌ బ్లౌజ్‌తో క్లీవేజ్‌ షో చేసింది. అయితే ఈ విషయంలో కొంతమంది ఆమె మీద కామెంట్స్‌ చేశారంటూ బాధపడిపోయింది కూడా. ఇప్పుడు దుస్తుల విషయంలో బిగ్‌బాస్‌ బృందం తనను అడిగిన విషయం బయటపెట్టంది.

తనను బిగ్‌బాస్‌ బృందం కురచ బట్టలు వేసుకోమని అడిగారని… అయితే అలాంటి దుస్తులు ధరించడంలో తనకు కంఫర్ట్‌ ఉండదని, అందుకే ధరించనని చెప్పానని చెప్పుకొచ్చింది మోనాల్‌. అంతేకాదు అలా కురచ దుస్తులు ధరించడానికి హారిక ఓకే చెప్పిందని కూడా అంది మోనాల్‌. అలా అని పొట్టి దుస్తులు ధరించడానికి ఇబ్బందేం లేకపోయినప్పటికీ… కంఫర్ట్‌ ఉండక వేసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. కురచ దుస్తులు లేకపోయినా ఎక్స్‌పోజింగ్‌ చేసే టాలెంట్‌ ఉంది కదా… అందుకే వద్దనుకుందేమో.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.