మోనాల్‌ మాటల వెనుక అర్థమేంటి.. బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, కోపాలు, తాపాలు, మోజులు, ముచ్చట్లు ఆఖరికి ఫేమ్‌ తర్వాత ఉండవు అంటుంటారు. ఇది ప్రతి బిగ్‌బాస్‌లోనూ జరుగుతుంటుంది. దీనికి భాషతో అస్సలు సంబంధం లేదు. కానీ వీటికి బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ పూర్తిగా విరుద్ధం అనిపిస్తోంది. కారణం బయటకు వచ్చీ రాగానే.. కొంతమందికి వరుస అవకాశాలు రావడం. బిగ్‌బాస్‌ ఇంట్లో కొంతమంది మధ్య కనిపించిన సఖ్యత ఇంకా బయట కొనసాగుతుండటం. ముఖ్యంగా చెప్పాలంటే సోహెల్‌, మెహబూబ్‌. దీంతో కొంతమంది మోనాల్‌ – అఖిల్‌ సంగతేంటి అని అడుగుతున్నారు. దీనిపై మోనాల్‌ స్పందించింది.

బిగ్‌బాస్‌ ఇంట్లో మోనాల్‌ – అఖిల్‌ లేదా అఖిల్‌ – మోనాల్‌ ఎలా ఉన్నారో అందరికీ తెలిసిందే. గొడవలు, అభిమానాలు, ప్రేమలు, హగ్గులు, ముద్దులు, కోపాలు, అలకలు, ఊరడింపులు, కసర్లు.. ఇలా చాలానే చేశారు ఈ ఇద్దరు. ఒక దశలో ఇద్దరూ బయటికొచ్చాక పెళ్లి చేసుకుంటారు అనేంతగా జీవించేశారు. బయటికొచ్చాక కూడా అలానే ఉంటారా అని అనుకుంటుండగా… రెండు, మూడుసార్లు కలిసి… ఇంకా వీరు టచ్‌లోనే ఉన్నారు అని చెప్పకనే చెప్పారు. మొన్న న్యూ ఇయర్‌కి వీళ్లు కలిసిన ఫొటోలు బయటికొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ లేదు.

ఈ విషయమే మోనాల్‌ దగ్గర మాట్లాడితే ‘‘అఖిల్‌ ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడా ఏంటి. బిగ్‌ బాస్‌ న ఉంచి వచ్చాక మూడు సార్లు కలిశాం అంతే. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయాం. నాకు ఎప్పుడూ వర్క్‌తో బిజీగా ఉండటం అంటేనే ఇష్టం. దానిని మేం ఫాలో అవుతున్నాం’’ అంటూ స్పందించి మోనాల్‌. నిజమే కదా… అప్పుడు ఫుటేజ్‌ కోసమో, బిగ్‌బాస్‌ టీమ్‌ కోసమో చేశారు. తర్వాత కూడా అదే పని చేస్తే… జీవితంలో ముందుకు వెళ్లలేరు కదా… అర్థం చేసుకోరూ!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.