Son of India Teaser: మోహన్ బాబు తప్ప మరో హైలెట్ ఏమీ లేదు..బోరింగ్..!

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మిస్తున్నాడు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఇక ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్‌ ను కొద్దిసేపటి క్రితం హీరో సూర్య విడుదల చేశారు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున మోహన్ బాబు హీరోగా నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.

ఆ సెంటిమెంట్ తోనే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ ను కూడా జూన్ 4న విడుదల చేశారు. మరి ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి : ‘మన అంచనాలకు అందని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ మొదలైంది. ‘తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి తాట్ ను ట్రిగర్ చేస్తాయో ఏ బ్రెయిన్ స్పెషలిస్ట్ చెప్పలేడు’ చిరంజీవి వాయిస్ ద్వారా ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేశారు.

‘నేను చీకటిలో ఉండే వెలుగుని.. వెలుతురులో ఉండే చీకటిని’ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగ్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అయితే చివర్లో ‘నేను కసక్ అంటే మీరు ఫసక్’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో టీజర్ సాగింది.అయితే డైమండ్ రత్నబాబు మళ్ళీ ‘బుర్రకథ’ లాంటి సినిమానే తీసాడా అనే అనుమానం కలిగిస్తుంది ఈ టీజర్. ఫస్ట్ లుక్ బాగానే ఉన్నప్పటికీ.. టీజర్ ఎందుకో అంత ఆకర్షించే విధంగా లేదు. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి :


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Share.