‘మీర్జాపూర్ 2’ పై పైరసీ ఎఫెక్ట్!

భారీ అంచనాల మధ్య ‘మీర్జాపూర్’ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా గతంలో వచ్చిన ‘మీర్జాపూర్’ సిరీస్ బాగా సక్సెస్ అయింది. బోల్డ్, వయిలెంట్ కంటెంట్ ఇష్టపడే ఓ వర్గపు ప్రేక్షకులను ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయింది. ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు రెండో సీజన్ ని కూడా విడుదల చేశారు. దసరా కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ని విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ పై సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.

దానికి కారణం ఏంటంటే.. ‘మీర్జాపూర్’లో కీలక పాత్ర పోషించిన అలీ ఫైజల్ గతేడాది కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు అలీ. అతడిని యాంటీ నేషనల్ అంటూ హిందూవాదులు అభివర్ణించారు. అప్పటినుండి అలీ ఫైజల్ కి సంబంధించిన ప్రతీ విషయంపై కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నటుడిగా అలీ ఫైజల్ కి ‘మీర్జాపూర్’ సిరీస్ తోనే మంచి గుర్తింపు వచ్చింది.

పైగా సీజన్ 2 మొత్తం కూడా అతడి చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ గురించి కొన్ని రోజుల ముందు నుండే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టైమ్ వచ్చేసరికి అతడిపై ఉన్న నెగెటివిటీతో.. టెలిగ్రామ్ పైరసీ లింక్ ను ట్విట్టర్ షేర్ చేసి మరీ పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ‘మీర్జాపూర్ 2’ సీజన్ ను పైరసీలోనే చూస్తామనే టెంప్లేట్ మెసేజ్ లు వేల మంది పోస్ట్ చేసి అలీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ.. పైరసీని మరింత వ్యాప్తి చేస్తున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.