‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ సింగిల్ రివ్యూ..!

డిసెంబర్ నెల ప్రారంభం నుండీ ప్రతీ సోమవారం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండీ ఓ లిరికల్ సాంగ్ విడుదల చేస్తామని చెప్పు అభిమానులకి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పి ఉత్సాహం నింపారు దర్శకుడు అనిల్ రావిపూడి మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. చెప్పినట్టుగానే ఈరోజు ‘మైండ్ బ్లాక్’ అంటూ ఓ మాస్ సాంగ్ ను విడుదల చేశారు. శ్రీమణి, దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఈ మాస్ సాంగ్ కు లిరిక్స్ అందించారు. ఫుల్ మాస్ బీట్స్ తో ఇంగ్లీష్ పదాలతో ఈ పాట సాగింది.

Mind Block's Song Review Sarileru Neekevvaru Movie1

మధ్యమధ్యలో మహేష్ బాబు వాయిస్ తో ఈ పాటకు జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ పాట దేవి శ్రీ ప్రసాద్ చెప్పినంత రేంజ్లో లేకపోయినప్పటికీ.. పర్వాలేదనిపిస్తుంది. ఫ్యాన్స్ కు మరియు మాస్ ఆడియన్స్ ఈ పాట బాగా నచ్చే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక విజువల్ గా ఈ పాటలో మహేష్ చేత మాస్ స్టెప్పులు వేయించే ప్రయత్నం చేస్తే మాత్రం పండక్కి థియేటర్లు మారు మోగిపోవడం ఖాయం అని చెప్పొచ్చు. ఏమైనా ‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ తో పోలిస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ సింగిల్ పాస్ మార్కులు వేయించుకుంది చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి వినెయ్యండి.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.