మాస్ కి నచ్చినా.. క్లాస్ తిట్టుకుంటున్నారు..!

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పక్కా మాస్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. 13 ఏళ్ళ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా అనౌన్స్ చేసినప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం.. ‘వద్దంటూ’ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మంచి మ్యూజిక్ ఇస్తాను.. పాటలు అదిరిపోతాయి’ అని దేవి శ్రీ ప్రామిస్ చేసాడు. కానీ ఫస్ట్ సింగిల్ వింటే అంత అలరించలేదు అనే చెప్పాలి. ‘మహర్షి’ చిత్రం ఫస్ట్ సింగిల్ తో పోలిస్తే ‘మైండ్ బ్లాక్’ సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

Mind Block song Mahesh Babu

ఈ పాట.. క్లాస్ ఆడియన్స్ ను అస్సలు ఆకట్టుకోలేదు. మాస్ పాట కాబట్టి వారిని ఆకట్టుకోలేదు అనడం సరికాదు. ఈ ఏడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని మాస్ పాటలకు క్లాస్ ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. ఇందులో కారణాలు తడుముకోవడానికి ఏమీ లేవు.. దేవి శ్రీ ప్రసాద్ రొటీన్ ట్యూన్లే అని చెప్పాలి. అయినప్పటికీ ఈ లిరికల్ సాంగ్ కు 10 మిలియన్ వ్యూస్ రావడం.. రికార్డులు సృష్టించడం చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ గా ‘మైండ్ బ్లాక్’ రికార్డు సృష్టించింది.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.