మెట్రో కథలు టీజర్ లో హైలైట్ గా మారిన నందినిరాయ్

“మోసగాళ్లకు మోసగాడు” సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా నటించి, ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేక చతికిలపడిన తెలుగమ్మాయి నందినిరాయ్. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫామ్ లోకి రాలేకపోయింది. అయితే.. మొన్నామధ్య క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ మాత్రం ఆమెను కొన్ని రోజులు వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి. అలా వార్తల్లో నిలవడమే ఆమె పాలిట వరంగా మారింది. ఆ సెన్సేషన్ కారణంగా ఆమెకు ఒక వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది అదే “మెట్రో కథలు”.

ఆహా యాప్ ఒరిజినల్ గా రూపొందిన ఈ వెబ్ ఫిలిం టీజర్ ఇవాళ విడుదలైంది. రాజీవ్ కనకాల, తిరువీర్, సన వంటి వారందరూ ఈ వెబ్ ఫిలింలో నటిస్తున్నప్పటికీ.. విడుదలైన టీజర్ లో మాత్రం నందినిరాయ్ భీభత్సంగా హైలైట్ ఐయింది. అందుకు కారణం ఆమె ఈ వెబ్ ఫిలింలో హైటెక్ వేశ్యగా నటిస్తుండడమే. ఈ టీజర్ లో గీత దాటని కొన్ని శృంగార సన్నివేశాలు, లిప్ లాక్స్ ఉన్నాయని టీజర్ లోనే స్పష్టం చేశారు బృందం.

Metro Kathalu Movie Teaser1

“పలాస” చిత్రంతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ ఫిలిం ఆగస్టు 14 నుంచి ఆహా యాప్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ వెబ్ ఫిలింలో పేరున్న ఆర్టిస్టులు ఎందరున్నా నందినిరాయ్ టార్గెట్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుందని మాత్రం స్పష్టమైంది. మరి ఈ “మెట్రో కథలు”తో వచ్చే ఫేమ్ ను నందినిరాయ్ సరిగా క్యాష్ చేసుకోగలుగుతుందో లేదో చూడాలి.

Share.