బిగ్ బాస్ 4: పర్సనల్ గా చెక్ రాసిచ్చిన చిరంజీవి..!

బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాలే చాలా నాటకీయంగా ముగిసింది. అభిజీత్ విన్నర్ అయినా కూడా కేవలం 25 లక్షల ప్రైజ్ మనీని మాత్రమే పొందగలిగాడు. అయితే, ఇక్కడే ఎలిమినేషన్ జరిగేటపుడు సోహైల్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగా సోహైల్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నీరాజనాలు పడుతున్నారు. 25 లక్షల ప్రైజ్ మనీ అంటే మాటలు కాదని, సోహైల్ అది తీసుకుని చాలా మంచి పని చేశాడని చెప్తున్నారు. నిజానికి ఎప్పుడూ కథ వేరే ఉంటుంది అనే సోహైల్ నిజంగా ఇప్పుడు తన స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడని చెప్తున్నారు.

ఇక ఫినాలేలో 25 లక్షల ప్రైజ్ మనీని తీసుకుని అందులో 10 లక్షల రూపాయలు అనాధశరణాలయానికి ఇస్తానని, అప్పుడు ప్రజలు నన్ను ప్రేమించి ఓట్లు వేసిన దానికి న్యాయం చేసినట్లుగా ఉంటుందని చెప్పాడు. దీంతో సోహైల్ ని మూడో వ్యక్తిగా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క డెసీషన్ తోనే ప్రజల హృదయాలని గెలుచుకున్నాడు సోహైల్. ఇక స్టేజ్ దగ్గరకి వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు అనాధలకి ఇచ్చేదాంట్లోనే 5 లక్షలు నేను మెహబూబ్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను అనేసరికి, మెహబూబ్ నాకు వద్దు ప్లీజ్ అది నేను తిరిగి మళ్లీ అనాధలకే ఇచ్చేస్తానని చెప్పడంతో నాగార్జున హృదయం కదిలింది. మీ ఇద్దరూ వద్దు మీకు ఇచ్చిన మనీ మీ దగ్గరే ఉంచుకోండి. నేను 10 లక్షలు పర్సనల్ గా ఇస్తున్నాను అనే సరికి స్టూడియో చప్పట్లతో మార్మోగిపోయింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ చేసిన పనిని మెచ్చుకున్నారు. అంతేకాదు, మెహబూబ్ ని చూస్తుంటే చిన్న వయసులో నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పాడు. అక్కడే మెహబూబ్ అనాధలకి ఇస్తానని చెప్పిన ఎమౌంట్ కంటే కూడా రెట్టింపు అంటే 10 లక్షలు రూపాయలు నేను ఇస్తున్నాను అని చెప్పి మెహబూబ్ కి అక్కడిక్కడే చెక్ రాసి ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. దీంతో మెహబూబ్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. అదీ విషయం.

Share.