బిగ్ బాస్ 4: నిజంగానే కథ వేరేగా ఉంది సోహైలా..!

బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే లో అభిజీత్ విన్నర్ అయ్యాడు. కానీ సోహైల్ హైలెట్ అయ్యాడు. నిజంగానే తన కథ వేరే ఉంది అని ప్రేక్షకులకి చూపించాడు. 25 లక్షల ప్రైజ్ మనీని జస్ట్ లైక్ దట్ తీస్కుని వెళ్లిపోయాడు. ఈసారి సీజన్ లో ఫినాలే ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. నాటకీయంగా జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో సోహైల్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఫస్ట్ నుంచి కథ వేరే ఉంటది అనే సోహైల్ తన కథకి క్లైమాక్స్ ఇదే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

ముందుగా ఎలిమినేషన్ ప్రోసెస్ లో ఫినాలేలో టాప్ – 5 లో నుంచి ఫస్ట్ దేత్తడి హారికని వినూత్న పద్దతితో ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీమ్. అక్కడ్నుంచి కథ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ప్రణీత సిల్వర్ సూట్ కేస్ లో 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని తీస్కుని వచ్చి హౌస్ మేట్స్ ని టెమ్ట్ చేసింది. కానీ, హౌస్ మేట్స్ మనీ వద్దని ట్రోఫీనే కావాలని అన్నారు. ఆ తర్వాత అరియానాని సిగ్నల్స్ సహకారంతో లక్ష్మీరాయ్ వచ్చి గ్రీన్ లైట్ వేసి మరీ ఎలిమినేట్ చేసి తనతో తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత హౌస్ లో పెద్ద డ్రామానే జరిగింది. ఈసారి హౌస్ లోకి గోల్డెన్ బ్రీఫ్ కేస్ వచ్చింది. అందులో ఏకంగా 20 లక్షల ప్రైజ్ మనీ పెట్టాడు బిగ్ బాస్.

ఈ ఆఫర్ కి స్టేజ్ పైనుంచి నాగార్జున హౌస్ మేట్స్ ముగ్గురిలో ఆసక్తిని రగిలించాడు. అంతేకాదు, ప్రైజ్ మనీని మరో 5 లక్షలు పెంచేసరికి సోహైల్ ఆసక్తిని కనపరిచాడు. వెంటనే నేను తీసుకుంటాను అంటూ చెప్పాడు. అక్కడ్నుంచీ అందరిలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అఖిల్ గెలిచిన, అభిజీత్ గెలిచినా నాకు ఒకటే అని, వారితో ట్రోఫీ పంచుకుంటాను అని, 25 లక్షలు ప్రైజ్ మనీ చాలని చెప్పి నాకలలని సాకారం చేసుకుంటాను అంటూ బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకి వచ్చేశాడు. అక్కడే తన కథ వేరే ఉందని చెప్పకనే చెప్పాడు.

అంతేకాదు, మెగాస్టార్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని సోహైల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పి, తన వైఫ్ సురేఖ మటన్ బిర్యానీ కూడా వండి పంపించిందని చెప్పడంతో సోహైలా ఆనందం రెట్టింపు అయ్యింది. ఇక్కడే తన ప్రైజ్ మనీలో 10 లక్షలు అనాధలకి ఇస్తానని ప్రామిస్ చేశాడని తెలిసి నాగార్జున ఆ 10 లక్షలు తాను ఇస్తానని చెప్పడంతో సోహైల్ ఉప్పొంగిపోయాడు. ఆతర్వాత ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తను పర్సనల్ గా 10 లక్షల రూపాయలని మెహబూబ్ కి ఇచ్చాడు.

Share.