‘ఏ.ఎం.బి సినిమాస్’ లో మెగా ఫ్యామిలీ సందడి..!

మెగా హీరోలు ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు చాలా బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక సాయి తేజ్ కూడా ‘ప్రతీరోజు పండగే’ సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ కూడా పులి వాసు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. నిహారిక ఎలాగూ వెబ్ సిరీస్ లతో అంతకన్నా బిజీగా గడుపుతుంది. ఇక వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ నిర్మాతగా కూడా ఓ చిత్రం రూపొందుతుంది.

Mega Family at AMB Cinemas1

ఇదిలా ఉంటే.. సడెన్ గా మెగా ఫ్యామిలీ బ్యాచ్ అంతా మహేష్ బాబు ‘ఏ.ఎం.బి సినిమాస్’ లో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో వారు తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలా అని ఈ పిక్ లో చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు వారి ఫ్యామిలీస్ ఈ పిక్ లో లేరు. మిగిలిన హీరోలు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి తేజ్, నిహారిక, అల్లు బాబీ, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, శ్రీజ తదితరులు ఉన్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.