నిర్మాతగా కూడా విజయ్ హిట్టు కొట్టేసినట్టే..!

తనని హీరోగా పరిచయం చేసి పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని.. హీరోగా పరిచయం చేయాలి అని ఇప్పటికి వరకూ ఏ హీరో అనుకోని ఉండడు. ఇలా విచిత్రమైన ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చాడు మన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. అది కూడా అతనే నిర్మాతగా మారి..! ‘ఎ కింగ్ ఆఫ్ ది హిల్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి తన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని రూపొందించాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదల చేయగా.. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

meeku-maathrame-cheptha-movie-trailer-review1

‘మన లైఫ్ మన చేతిలో ఉందొ లేదో కానీ.. మనందరి చేతిలో మాత్రం కచ్చితంగా ఫోన్ ఉంటుంది’ అని వెన్నెల కిశోర్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక ఈ ట్రైలర్ ప్రకారం హీరోకి సంబందించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్లో కి వస్తుంది. ఆ వీడియో బయటకి వస్తే ఎక్కడ తన పెళ్ళి ఆగిపోతుందో ఒకవేళ పెళ్ళి జరిగినా తనకి పుట్టబోయే పిల్లలు ఆ వీడియో చూస్తే.. ఆ వీడియో వారి పై ఎంత ప్రభావితం చేస్తుందో’ అని భయపడే హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో హీరోతో కలిసి వారి స్నేహితులు చేసే కామెడీ హైలెట్ గా నిలుస్తుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ‘మళ్ళీరావా’ ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ అభినవ్ గోమటం కామెడీ ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచేలా ఉంది. ఇక అనసూయ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్ర కథని 2014 లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘సె** టేప్’ నుండీ లేపేసినట్టు తెలుస్తుంది. మరి అది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. మొత్తానికి ట్రైలర్ అయితే ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.