‘మాస్టర్’ 6 డేస్ కలెక్షన్స్..!

ఇళయధళపతి విజయ్ హీరోగా ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. విజయ్ సేతుపతి వంటి మరో క్రేజీ హీరో ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి నడుమ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కొంతమంది ఈ చిత్రం బాగుంది అన్నారు.. మరికొంత మంది బాలేదు అన్నారు.. అయినా సరే ‘మాస్టర్’ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతుందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించడం గమనార్హం.

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం 3.24 cr
సీడెడ్ 2.37 cr
ఉత్తరాంధ్ర 2.02 cr
ఈస్ట్ 1.06 cr
వెస్ట్ 1.08 cr
కృష్ణా 0.96 cr
గుంటూరు 1.19 cr
నెల్లూరు 0.57 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 12.49 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 12.49 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 3.49 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. సోమవారం రోజున కూడా ఈ చిత్రం 0.73 కోట్ల షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.