డబుల్ డోస్ పెంచిన రవితేజ..!

చాలాకాలం తర్వాత క్రాక్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. పక్కా మాస్ యాక్షన్ మూవీగా కలక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది ఈ సినిమా. 2021ని దిగ్విజయంగా మంచి సక్సెస్ తో స్టార్ట్ చేశాడు మనోడు. దీంతో పాటుగా తన రెమ్యూనిరేషన్ డోస్ ని కూడా పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా సరైన హిట్ లేక రవితేజ మార్కెట్ కాస్త డల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రొడ్యూసర్స్ మాస్ హీరో డిమాండ్ చేసినంత పారితోషకాన్ని ఇవ్వలేకపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

దిల్ రాజు వంటి నిర్మాతలు రవితేజతో సినిమాని వదలుకోవడానికి కారణం కూడా రెమ్యునిరేషనే అని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు క్రాక్ తో రవితేజ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. నిన్నటివరకు 10 కోట్ల వరకే ఉన్న రవితేజ రెమ్యునిరేషన్ ఇప్పుడు క్రాక్ తో బీట్ చేశాడు. డబుల్ డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు, ఇక నుంచి తను చేయబోయే సినిమాల్లో కలక్షన్స్ లో వాటాని కూడా తీస్కోబోతున్నాడని టాక్. ఈ సినిమా సీక్వల్ కూడా చేస్తానని తన మనసులో మాటల్ని బయటపెట్టాడు కూడా. అంతేకాదు, రాజా హీరోగా కాకుండా డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సినీపండితులు.

ప్రస్తుతం విశాఖలో క్రాక్ సక్సస్ పార్టీని చిత్రయూనిట్ జరుపుకుంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి కూడా ఈసినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. అందుకే, మనోడితో సినిమాలు చేయడానికి కుర్రహీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఆసక్తిచూపిస్తున్నారని సినీనగర్ టాక్. ఇక మరోవైపు రవితేజ ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. దీన్ని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మాస్ రాజా మొదలెడితే ఇక ఆగేదే లేదని, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అదీ విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.