ఉత్కంఠభరితంగా మరణం టీజర్..!

మరణం టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం హీరో హీరోయిన్స్ పైన హారర్ కంటెంట్ తో క్రియేట్ చేసిన ఈ టీజర్ మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా అందరి దృష్టిలో పడింది. రీసంట్ గా ఈ టీజన్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ లాంఛ్ చేశారు. అంతేకాదు, మంచి కంటెంట్ ఉన్న హారర్ సినిమాలకి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుందని చెప్పారు. అంతేకాదు, శ్రీరాపాక, వీర్ సాగర్ కాంబినేషన్ లో మంచి కథ దొరికితే సినిమా చేస్తానని చెప్పారు.

అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. వీర్ సాగర్, శ్రీ రాపాక కాంబినేషన్ లో తెరక్కిన చిత్రం మరణం. వీర్ సాగర్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇక టీజర్ చూస్తుంటే హీరోయిన్ కి దెయ్యం పట్టినట్లుగా బిహేవ్ చేస్తుంటే , హీరో మాత్రం చాలా కూల్ గా సైలెంట్ గా ఉన్నాడు. అంతేకాదు, హీరోయిన్ హావభావాలు, ఇంకా హారర్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్కుని రిలీజ్ చేస్తామని చెప్తోంది చిత్రయూనిట్. శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మనోజ్ కుమార్ చేవూరి మ్యుజిక్ అందిస్తున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.