‘మన్మధుడు2’ : రకుల్ టీజర్ ఎలా ఉందంటే?

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచేసింది. అయితే ఆ టీజర్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను చూపించలేదు. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ టీజర్ ను విడుదల చేస్తానని దర్శకుడు ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ కు సంబందించిన టీజర్ ను విడుదల చేసారు.

.

manmadhudu2-rakul-preet-teaser1

ఈ టీజర్లో అవంతిక పాత్రలో కనిపిస్తుంది రకుల్. ‘ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సార్’ అని వెన్నెల కిశోర్ అనగా ఆమె విశ్వరూపం ఏంటనేది నెక్స్ట్ చూపించారు. నాగ్ ను ఏడిపిస్తూ… సిగరెట్లు కాలుస్తూ.. రకుల్ ఈ టీజర్లో కనిపించింది. ఓ పక్కన సంప్రదాయంగా కనిపిస్తూనే మరో పక్కా ‘పాష్ గర్ల్’ గా రెచ్చగొడుతుంది. అంటే రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో రకుల్ కనిపించబోతుందన్న మాట. ‘ఇప్పటిదాకా ‘యు’ సర్టిఫికెట్ ప్రయత్నించాను… ఇప్పుడు ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తా’ అంటూ రకుల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ‘అవంతిక’ టీజర్ తో ‘మన్మధుడు2’ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మీరు కూడా ఈ టీజర్ ను ఓ లుక్కెయ్యండి.

Share.