నాగార్జున హిట్టు కొట్టేలానే ఉన్నాడుగా..!

‘కింగ్’ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సమంత, కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తుండగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నాడు. ‘ఆనంది ఆర్ట్స్’ ‘మనం ఎంటర్టైన్మెంట్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానెర్ల పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 9 న విడుదల చేయబోతున్నారు. ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ గా ‘మన్మధుడు2’ మూవీ తెరకెక్కినట్టు డైరెక్టర్ రాహుల్ తెలిపాడు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితమే ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం రండి.

manmadhudu-2-movie-trailer-review

‘అద్భుతం.. అమోఘం.. ఇలాంటి పధకం శ్రీకృష్ణుడు కూడా మహా భారతం లో వేయలేదు.. అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్లో ఎప్పటి లాగే నాగార్జున చాలా గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాగ్ పక్కన బాగానే కుదిరింది. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుంటుంది. పెళ్ళన్నా.. పిల్లలన్నా ఇష్టం లేని వ్యక్తిగా నాగార్జున కనిపిస్తున్నాడు. వెన్నెల కిశోర్, రావు రమేష్ కామెడీ సినిమాలో అదిరిపోయేలా ఉంది. పక్కా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టం చేసింది. నాగార్జున లిప్ లాకులతో రచ్చ చేశాడు. ‘ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ ‘ఏ క్యాస్ట్… బ్రాడ్ క్యాస్ట్’ అనే డైలాగులు త్రివిక్రమ్ లేని లోటుని భర్తీ చేసినట్టున్నాయి. మొత్తానికి ‘మన్మధుడు2’ ట్రైలర్ బాగుంది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాల్ని మరింత పెంచేసిందనే చెప్పాలి.

Share.