మహేష్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపిన మంజుల..!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది మంజుల. ‘షో’ అనే డిఫరెంట్ చిత్రాన్ని నిర్మించింది మంజుల. ఆ చిత్రానికి నేషనల్ అవార్డు రావడంతో ఈమె పై అందరికీ ఫోకస్ పడింది. ఇక ‘నాని’ వంటి డిఫరెంట్ సినిమాని అలాగే ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ ను నిర్మించింది కూడా మంజులనే..!అంతేకాదు ‘ఆరెంజ్’ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ అక్కగా కూడా నటించి అలరించింది.

అలాగే నాగ చైతన్య, సమంత లతో ‘ఏమాయ చేసావే’ వంటి క్లాసిక్ ను రూపొందించింది కూడా మంజులనే అన్న సంగతి అందరికీ తెలిసిందే. నటిగానూ అలాగే నిర్మాతగానూ కూడా తన ప్రతిభను చాటుకుంది మంజుల. ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు మరియు స్టార్ హీరో అయిన మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది మంజుల. ఆమె మాట్లాడుతూ.. ‘మహేష్ తన కంటే చిన్నవాడే అయినప్పటికీ నన్ను విషయాల్లోనూ గైడ్ చేస్తుంటాడు.

అందరూ అనుకుంటున్నట్లు మహేష్ కి నేను సలహాలు ఇవ్వను. ఆరోగ్యం, వర్కవుట్స్‌ తో పాటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మహేష్ ‌కు చాలా మంచి అవగాహన ఉంది. ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు” అంటూ చెప్పుకొచ్చింది మంజుల. అంతేకాదు మంచి కథ దొరికితే అతనితో మళ్ళీ ఓ సినిమా నిర్మిస్తాను అని కూడా తెలిపింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.