వయసు పెరిగే కొద్దీ మహేష్‌ కుర్రాడు అయిపోతున్నాడట

‘మహేష్‌.. మహేష్‌.. ’ అంటూ అదేదో సినిమా హీరోయిన్‌ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అమ్మాయిలు అంతగా మహేష్‌ గురించి మైమరిచిపోతారా? అంటే అవుననే చెప్పాలి. మహేష్‌ సినిమా ఫస్ట్‌ షోకి చాలా థియేటర్లలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ కనిపిస్తుంటుంది. మహేష్‌ గ్లామర్‌ మాయ అలాంటిది మరి. ఆయన గ్లామర్‌ రహస్యం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారి కోసం మంచు విష్ణు ద్గగర సమాధానముంది. దానినే సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చాడు విష్ణు.

అభిమానులు, సహనటులతో పాటు ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయిపోతుంటారు. అలా తాజాగా మహేష్‌ బాబుపై మరో హీరో మంచు విష్ణు ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల జరిగిన విష్ణు సతీమణి వెరొనికా పుట్టిన రోజు వేడుకకు నమ్రత, మహేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోల్లో ఒక ఫొటోని విష్ణు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతోపాటు ఆసక్తికరమైన కామెంట్‌ని పోస్ట్‌ చేశాడు. అందులోనే మహేష్‌ అందం గురించి, దాని వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి రాసుకొచ్చాడు.

‘‘ఈ ఫొటోలోని వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారిపోతున్నాడు. రోజు రోజుకు అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే ఆ అందానికి ప్రధాన కారణం’’ అని రాసుకొచ్చాడు విష్ణు. మరోవైపు అంతే మంచితనం, గౌరవంతో మహేష్‌బాబు కూడా స్పందించాడు. ‘ఇంతమంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.