మరోసారి ప్రేమలో పడ్డ హీరో!

మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. చాలా కాలంగా సింగిల్ గా ఉంటోన్న ఈ హీరో మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై మంచు ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించలేదు. నిజానికి మనోజ్ కి 2015లో ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరిగింది.

వీరిద్దరిదీ ప్రేమ పెళ్లి. స్నేహితుల ద్వారా పరిచయమైన ప్రణతి తనకు బాగా నచ్చడంతో మనోజ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. కానీ వీరి పెళ్లికి మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ అంగీకరించలేదు. అయినప్పటికీ మనోజ్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన ఏడాది పాటు ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో సెపరేట్ అయ్యారు. ప్రణతి అమెరికా వెళ్లిపోయింది. 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది.

విడాకుల తరువాత మనోజ్ సినిమాపై దృష్టి సారించాడు. సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మనోజ్ మళ్లీ సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడితో వెబ్ సిరీస్ చేయబోతున్నాడని సమాచారం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.