మనసుకే సాంగ్ కవర్ | షన్ముఖ్ జస్వంత్ | అమృత

ఒక ప్రేమ కథ. రెండు ప్రధాన పాత్రలు. ఒక అబ్బాయ్ (షన్ముఖ్ జస్వంత్), ఒక అమ్మాయి (అమృత). మూడు డైలాగులు. నాలుగు నిముషాల్లో షార్ట్ ఫిలిం కంప్లీట్. ఇంత క్యూట్ గా కూడా లవ్ స్టోరీని చెప్పవచ్చని “మనసుకే సాంగ్ కవర్- 24 మూవీ” షార్ట్ ఫిలిం చూసిన తర్వాత తెలిసింది.

ఇందులో షన్ముఖ్, అమృతల నటన స్వీట్ గా ఉంటుంది. లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “24” సినిమాలోని “మనసుకే మధువివే.. వయసుకే విషమువే” అనే పాటకు వీరు వేసిన డాన్సు చక్కగా ఉంది. కొరియోగ్రఫీ తో పాటు వీరిద్దరి మధ్య కెమిస్ట్రి బాగా వర్క్ అవుట్ అయింది. చూస్తున్న వారికి అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది.

Share.